- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శరవేగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సేకరణ.. రెండు ఫేజ్‌లలో నిర్మాణం
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూమిని సేకరిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తున్నామని తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: అమరావతి ఇన్నర్ రింగ్(Amaravati Inner Ring) రోడ్డుకు భూమిని సేకరిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రాజధాని(Capital)లోని ట్రంక్ రోడ్స్ మౌలిక సదుపాయాలు ADB, ప్రపంచ బ్యాంకు, హడ్కో, నాబార్డ్, వివిధ సంస్థల ద్వారా 40,847 కోట్లు సమకూర్చామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ భూ సమీకరణ అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం కనీసం 24 నుంచి 30 నెలల సమయం పడుతుందని మంత్రి నారాయణ తెలిపారు.
‘‘రాజధానిలోని ట్రంక్ రోడ్స్ ఏప్రిల్ 2027కి పూర్తి చేసేందుకు ప్రణాళిక చేశాం. ఇన్నర్ రింగ్ రోడ్డులో 96.2. కి.మీ పొడవు,75 మీటర్ల వెడల్పుతో 8+4 వరసలు రోడ్డు నిర్మాణానికి డిజైన్. రెండు ఫేజ్‌లలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం. మొదటిప్ ఫేజ్ లో కేతన కొండ నుంచి నున్న వరకు నిర్మాణం. రెండో ఫేజ్‌లో నున్న నుంచి కేతన కొండ వరకు నిర్మాణం. మొదటి దశలో 67.6 కిలోమీటర్ల నిర్మాణం. గుంటూరు జిల్లాలో 14, పల్నాడు జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 6 , ఎన్టీఆర్ జిల్లాలో 3 గ్రామాలు , మొత్తం 26 గ్రామాల ద్వారా నిర్మాణం. మొదటి దశకు డీపీఆర్ కూడా సిద్ధమయ్యింది. మొదటి దశ నిర్మాణానికి భూ సమీకరణ ప్రారంభించాం. ఆరు నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రాజధాని పరిధిలో 55 ట్రంక్ రోడ్స్ నిర్మాణం. 45 ట్రంక్ రోడ్స్ 18,779 కోట్ల తో టెండర్స్ పిలిచాం. అన్ని నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, బిల్డింగ్స్ కి 6,229 కోట్లు ఇప్పటికే నిర్మాణ సంస్థలకు చెల్లించడం జరిగింది. 2027 మార్చ్ కి ట్రంక్ రోడ్స్ పూర్తి అవుతాయి.’’ అని మంత్రి నారాయణ తెలిపారు.






