కార్యకర్తలకు అండగా మంత్రి నారాయణ.. రూ. 50 కోట్లు ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-23 15:29:52  IST  )

పార్టీని నమ్ముకొని.. సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మంత్రి నారాయణ తెలిపారు....

కార్యకర్తలకు అండగా మంత్రి నారాయణ.. రూ. 50 కోట్లు ప్రకటన
X

దిశ,నెల్లూరు సిటీ: పార్టీని నమ్ముకొని.. సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట నడిచి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.. సొంత నిధుల నుండి కార్యకర్తలకు ఏటా 10 కోట్లు లెక్కన 5 సంవత్సరాలకు 50 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా కార్యకర్తల సంక్షేమ నిధి నుండి బుధవారం 175 మంది 45 లక్షలు రూపాయల చెక్కులను మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో కలిసి గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు..

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు నగర సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నామని..ఎండ్ టు ఎండ్ రోడ్ల పనులు సెరవేగంగా జరుగుతున్నాయన్నారు..స్వీపింగ్ మిషన్ లతోనే ఇకపై రోడ్లు శుభ్రం చేస్తామన్నారు..28 స్వీపింగ్ మిషన్ లను కార్పొరేషన్ కి ఇవ్వటం జరిగిందని..సిటీ లో 5 వేల మందికి ఇంటిపట్టాలు ఇప్పించాలన్నదే నా లక్ష్యం అని తెలిపారు..మంచినీటి ప్రాజెక్టుకు 120 కోట్లు మంజూరు అయ్యాయని..డిసెంబర్ కల్లా సంగం బ్యారేజ్ నుంచి ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు..డ్రైన్ల మరమ్మత్తులు ,కొత్తడ్రైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని..50 కోట్లతో మేజర్ కెనాల్స్ రివిట్ మెంట్ పనులు ప్రారంభిస్తున్నామని..అభివృద్ధి పనుల్లో ఆక్రమణ దారులకు ఎవరూ ఒత్తాసు పలకొద్దుని మంత్రి తెలిపారు.. ఖజానా ఖాళీ అయినా అభివృద్ధి కొనసాగిస్తున్నామన్నారు..ఓపిక పడితే హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి వెల్లడించారు.. అనంతరం మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి మాట్లాడారు మంత్రి నారాయణ సార్ మాటల మనిషి కాదని..చేసింది చెప్పుకొనే వ్వక్తి కూడా కాదని.. అనుకున్న పని చేసి తీరుతారని మంత్రి సతీమణి రమాదేవి తెలిపారు..విమర్శలను అభివృద్ధితో తిప్పికొడతారని.. ఆంధ్రకి 5 స్వచ్ఛ అవార్డులు సాధించిన ఘనత మంత్రి నారాయణ సార్కే దక్కుతుందన్నారు


నారాయణ హాస్పిటల్స్‌లో చికిత్సపై వచ్చే కార్యకర్తలకి అండగా నిలుస్తున్నారని..వీఆర్సీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని..భవిష్యత్తులో మరిన్ని స్కూల్స్ ని అదే తరహాలో ఆధునీకరించబోతున్నారని ఆమె తెలిపారు..పిల్లా ,పెద్దా ఆరోగ్యం కోసం అలోచించి అడుగులు వేస్తున్నారని..పార్కులను ఆధునీకరించి అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నామన్నారు..నారాయణ సార్ ఆధ్వర్యంలో మరెన్నో అభివృద్ధి పనులు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి సతీమణి రమాదేవి తెలిపారు.. అనంతరం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ నారాయణ అంటే అభివృద్ధి ,అభివృద్ధి అంటే నారాయణ ని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తల్లాపాక అనురాధ అన్నారు..సిటీ నియోజక వర్గ స్లోగన్ ఇదే అని..నారాయణ మంత్రమే అభివృద్ధి తంత్రం అన్నారు..నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నారాయణ సార్ లాంటి నేతను ఇప్పటివరకు నా జీవిత చరిత్రలో చూడలేదన్నారు.. ఏడాదికి 10 కోట్ల సొంతనిధులతో నారాయణ సార్ దంపతులు కార్యకర్తలకు సహాయం అందిస్తున్నారని..నారాయణ సార్ కి 2029 ఎన్నికల్లో లక్షా మెజారిటీ ఇచ్చి కృతజ్ఞత తెలుపుదామన్నారు..నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషిచేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు , మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి, కార్పొరేటర్లు ,క్లస్టర్ ఇంచార్జిలు ,డివిజన్ ప్రెసిడెంట్లు ,కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు .

Next Story