యోగాంధ్రకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు.. మంత్రి నారాయణ వెల్లడి

by Jakkula.Mamatha |

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

యోగాంధ్రకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు.. మంత్రి నారాయణ వెల్లడి
X

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో యోగాంధ్రలో పాల్గొనే ప్రజలకు రవాణా మరియు పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. విశాఖలో యోగాంధ్ర వేడుకలకు హాజరయ్యే ప్రజలకు రవాణా మరియు పార్కింగ్ ఏర్పాట్లపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో మంత్రి నారాయణ చర్చించారు. రేపు ఉదయం విశాఖలో 5 లక్షల మందితో యోగాభ్యాసం చేయనున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో దూర ప్రాంతాల వారు ఈ రోజే విశాఖ చేరుకుంటారు. దూరం నుంచి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించామని మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యే నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం 7295 బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. బస్సులు పార్కింగ్ చేయడం, అలాగే కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల పై చర్చించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వేడుకల కోసం 12000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు సిద్ధం చేశారు. భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలతో పాటు 30 డ్రోన్ లను నిరంతరం నిఘా కోసం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, మెప్మా ఎండీ పాల్గొన్నారు.

Next Story