- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు
by Naga Rani Yarlagadda |
ఏపీలో భారీ వర్షాలు (AP Rains) కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో భారీ వర్షాలు (AP Rains) కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి కమిషనర్లతో మంత్రి నారాయణ (Minister Narayana) ఫోన్ లో మాట్లాడారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
కాగా.. గతరాత్రి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరపి లేని వర్షంతో రోడ్లపై నీరు నిలవగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Next Story






