భోగాపురం మాస్టర్‌ప్లాన్ రోడ్ల నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించే నాటికి మాస్టర్‌ప్లాన్ రోడ్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. విశాఖలో పర్యటించిన మంత్రి.. సీతమ్మధారలోని మురికి వాడతో పాటు భోగాపురం ఎయిర్ పోర్టును అనుసంధానించే మాస్టర్‌ప్లాన్ రోడ్లు, నేరెళ్లవలస నుంచి కొత్తవలస, బోయపాలెం, కాపులుప్పాడ రోడ్డును పరిశీలించారు....

భోగాపురం మాస్టర్‌ప్లాన్ రోడ్ల నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: భోగాపురం ఎయిర్‌పోర్టు(Bhogapuram Airport)ను ప్రారంభించే నాటికి మాస్టర్‌ప్లాన్ రోడ్లు(Masterplan Roads) పూర్తి చేస్తామని మంత్రి నారాయణ(Minister Narayana) అన్నారు. విశాఖ(Visakha)లో పర్యటించిన మంత్రి.. సీతమ్మధారలోని మురికి వాడతో పాటు భోగాపురం ఎయిర్ పోర్టును అనుసంధానించే మాస్టర్‌ప్లాన్ రోడ్లు, నేరెళ్లవలస నుంచి కొత్తవలస, బోయపాలెం, కాపులుప్పాడ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 54 శాతం నిర్మాణాలు జరిగాయన్నారు. సీతమ్మధార ఏఎస్‌ఆర్‌నగర్‌లోని మురికివాడను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. సీతమ్మధార ప్రైవేట్ స్థలంలోని మురికివాడ వాసులకు కూడా అండగా ఉంటామని చెప్పారు. ఇళ్లు, షెడ్లు నిర్మించుకుని సుమారు 200 కుటుంబాలు ఉంటున్నాయన్నారు. త్వరలో భూ యజమానులతో మాట్లాడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరగదని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Next Story