నెల్లూరు టీడీపీ నేతలపై మంత్రి నారాయణ సీరియస్

by Malleboina Mahesh |

పౌరసరపరాల శాఖపై చేసిన ఆరోపణలతో.. నెల్లూరు టీడీపీ నేతలపై మంత్రి నారాయణ సీరియస్ అయ్యారు.

నెల్లూరు టీడీపీ నేతలపై మంత్రి నారాయణ సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: పౌరసరపరాల శాఖపై చేసిన ఆరోపణలతో.. నెల్లూరు టీడీపీ నేతలపై మంత్రి నారాయణ (Minister Narayana) సీరియస్ అయ్యారు. ఇటీవల నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రేషన్ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేయగా.. వారిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు తమ గొప్పల కోసం ఎవరికి వారు ప్రభుత్వ శాఖలపై ప్రకటనలు చేయడమేంటని ప్రశ్నించారు. ఎవరికి వారు ఇష్టమెచ్చినట్లు చేస్తున్న ప్రకటనలపై పార్టీ పెద్దలు తనను ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేతలను నియంత్రించడం లేదా అని అధిష్టానం అడుగుతుందని, ఇలాంటి గొడవల కారణంగా తాను తరచూ పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు.

కొందరు టీడీపీ నేతల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ తనను ప్రశ్నిస్తున్నారని, తన పౌరసరపరాల శాఖను తప్పుబట్టడంపై మంత్రి నాదెండ్లను ప్రశ్నిస్తున్నారని, తాము ఎన్డీయే ప్రభుత్వంలోనే ఉన్నామా అని అడిగారని, తాము టీడీపీ మంత్రుల శాఖల వ్యవహారాలపై మాట్లాడాలా అని ప్రశ్నించినట్లు మంత్రి నారాయణ పార్టీ నేతలకు తెలిపారు. అలాగే గతంలో కాకినాడలో వర్మ ఇలానే సొంత ప్రకటనలు చేసినందుకు ఆయనను సైలెంట్ చేశామని, ఇకపై జిల్లా నేతలను అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడవద్దని ఈ సందర్భంగా మంత్రి నారాయణ దిశ నిర్దేశం చేశారు.

Next Story