- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై మున్సిపల్ కమిషనర్లను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు...

దిశ,నెల్లూరు ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మున్సిపల్ కమిషనర్లను మంత్రి పొంగూరు నారాయణ అప్రమత్తం చేశారు. నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొని మంత్రికి ఆయా ప్రాంతాల్లోని పరిస్థితిని వివరించారు. వర్షాల నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు నైనా ఎదుర్కునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలని సూచించారు. ఇంజనీరింగ్, పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలియజేశారు. వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్‌లను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. పోలీసు, వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు






