మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు: జగన్‌‌కు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-08 12:07:51  IST  )

అమరావతిపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దని మాజీ సీఎం జగన్‌‌కు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు: జగన్‌‌కు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) అభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల సాధ్యమా అని మాజీ సీఎం వైఎస్ జగన్(Former Cm Ys Jagan) చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ(Minister Narayana) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నదీగర్భంలో నిర్మాణాలు చేపడుతున్నామని జగన్ చెబుతున్నారని, అవన్నీ అసత్యాలని కొట్టిపారేశారు. తాము ఎక్కడ కూడా నదీగర్భంలో నిర్మాణాలు చేయడం లేదన్నారు. జగన్ పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడాలని సూచించారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను జగన్ అర్థం చేసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నదీగర్భంలో నిర్మాణాలు చేపడుతున్నామని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతిపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీగర్భంలో నిర్మాణాలు చేపడుతున్నట్లు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని తెలిపారు. రివర్ బెడ్, రివర్ బేసిన్‌కు తేడా ఏంటో ముందు జగన్ తెలుసుకోవాలన్నారు. ఇలా అసత్యప్రచారాలు చేస్తేనే ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమతం చేశారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు.

రెండో విడతకూ ప్రజలకు సహకారం

‘‘రెండో విడత భూ సేకరణకూ రైతులు ముందుకొచ్చారు. గంటల సమయంలో ప్రభుత్వానికి వందల ఎకరాలు ఇచ్చారు. అమరావతి అభివృద్ధి చెందకూడదనే జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి అభివృద్ధి ఆగదు.’’ అని నారాయణ తెలిపారు.

Read More... రాజధానిపై మరోసారి విషం కక్కిన జగన్: మంత్రులు ఒక్కసారిగా బ్లో అవుట్

Next Story