- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధానిపై మరోసారి విషం కక్కిన జగన్: మంత్రులు ఒక్కసారిగా బ్లో అవుట్
అమరావతిపై జగన్ మళ్లీ విషం కక్కడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) రాజధాని(Amaravati Capital)పై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) విషం కక్కారు. నదీగర్భం(Riverbed)లో రాజధానిని నిర్మిస్తున్నారని, ఇందుకు రూ. 2 లక్షల కోట్లు కావాలని, అది సాధ్యమేనా అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఏపీ మంత్రులు సీరియస్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలకు మంత్రి పార్థసారధి (Minister ParthaSarathi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజధానిపై జగన్ అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని ఎన్నికల్లో ఓడిపోతే గాని జగన్(Jagan)ను అర్ధం కాలేదా అని ప్రశ్నించారు. అధికారం పోవడంతో రాజధానిపై జగన్ మాట మార్చారని ఎద్దేవా చేశారు. నదీగర్భంలో రాజధాని కడుతున్నారని జగన్ అంటున్నారని, కేంద్రం, ఆర్థిక సంస్థలకు తెలయని విషయాలు ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. ట్రూఅప్ చార్జీలు రూ.12,700 కోట్లు వసూలు చేయాలని జగన్ అధికారంలో ఉన్న సమయంలో డిస్కంలు ప్రతిపాదించాయని ఆయన గుర్తు చేశారు. జగన్ మళ్లీ సీఎం అయి ఉంటే ఆ భారమంతా ప్రజలపై పడేదని మంత్రి పార్ధసారధి తెలిపారు.
చిత్తుగా ఓడించినా..
ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు బుద్ధిరాలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Satya Prasad) అన్నారు. నదీ గర్భంలో రాజధాని కడుతున్నారని కుట్రకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. రాజధానికి చట్టబద్ధత వస్తుందని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోకాల్డ్ క్యాపిటల్ అంటూ ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.






