అమరావతి పనులు ఆలస్యం.. మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

అమరావతి నిర్మాణ పనుల్లో ఆలస్యంపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని, చేయలేకపోతే వెళ్లిపోవాలని అసహనం వ్యక్తం చేశారు...

అమరావతి పనులు ఆలస్యం.. మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) నిర్మాణ పనుల్లో ఆలస్యంపై మంత్రి నారాయణ(Minister Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని, చేయలేకపోతే వెళ్లిపోవాలని అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో గెజిటెడెట్ అధికారులు కోసం క్వార్టర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పనులను షాపూర్ జీ పల్లోంజీ కన్ స్ట్రక్షన్ సంస్థ(Shahpur Ji Pallonji Construction Company) ఆలస్యంగా నిర్మిస్తోంది. దీంతో మంత్రి నారాయణ ఈ పనులను పరిశీలించారు. పనులు ఆలస్యంపై అక్కడ పని చేస్తున్న ఇద్దరు ప్రతినిధులపై మండిపడ్డారు. అమరావతి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తుంటే.. తమరెందుకు ఆలస్యం చేస్తున్నారంటూ నిలదీశారు. షాపూర్ జీ పల్లోంజీ కన్ స్ట్రక్షన్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను వెంటనే పంపాలని సూచించారు. అలాగే తమ మేనేజ్‌మెంట్ వచ్చి సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని, పనుల ఆలస్యంపై సంజాయిషీ ఇవ్వాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

Next Story