మూడు రాజధానులతో రైతుల్ని రెచ్చగొట్టారు : మంత్రి నారాయణ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-28 06:34:47  IST  )

APCRDA చట్టం ప్రకారం గుర్తించిన ప్రాంతాలకు చట్టబద్ధత కల్పించే సవరణ చేయాలని రాజధాని చట్టబద్ధత తీర్మానంలో పేర్కొన్నారు.

మూడు రాజధానులతో రైతుల్ని రెచ్చగొట్టారు : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రజల పన్నెండేళ్ల కల.. త్వరలో సాకారం కానుంది. రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా చేయాలని పేర్కొంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టంలోని సెక్షన్ 5లో సబ్ సెక్షన్ 2లో "ఎట్ అమరావతి" పదం చేర్చాలని తీర్మానం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. దీనిపై సుమారు 4 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. APCRDA చట్టం ప్రకారం గుర్తించిన ప్రాంతాలకు చట్టబద్ధత కల్పించే సవరణ చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నట్లు వివరించారు. 2014లోనే టీటీడీ సర్కార్ అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని గుర్తుచేశారు. విజయవాడ - గుంటూరు నగరాల మధ్య రాజధాని ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుకున్నారని, రోడ్డు, రైల్వే రవాణాతో పాటు రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండేలా అమరావతిని తీర్చిదిద్దేందుకు సిద్ధమైందని తెలిపారు. రాజధానికి 29 వేలమంది రైతులు 30 వేల ఎకరాలు ఇస్తే.. భూములిచ్చిన రైతులకు ఏటా కౌలుతోపాటు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చేలా ల్యాండ్ పూలింగ్ చేశామన్నారు. కానీ.. 2019లో వైసీపీ మూడురాజధానుల పేరుతో అమరావతిని వ్యతిరేకిస్తూ.. రైతులను రెచ్చగొట్టిందని దుయ్యబట్టారు. ఇన్నేళ్లకు రాజధాని అమరావతిని చట్టబద్ధం చేసుకునే అవకాశం దక్కిందన్నారు.

జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు.. మంత్రి నారా లోకేశ్ సెటైర్లు

ఏపీ అసెంబ్లీ.. రాజధాని చట్టబద్ధత తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు

Next Story