- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు.. మంత్రి నారా లోకేశ్ సెటైర్లు
జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందని, రేపు అమరావతిని నేనే కట్టానని జగన్ చెప్పినా ఆశ్చర్యం లేదని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధానిని మార్చాలనే ఆలోచన ప్రపంచంలో జగన్‌కు తప్ప ఎవరికీ రాదని అభిప్రాయపడ్డారు. జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందని, రేపు అమరావతిని నేనే కట్టానని జగన్ చెప్పినా ఆశ్చర్యం లేదని విమర్శించారు. జగన్ పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తానంటున్నారు.. జగన్‌కు ప్రజలు చూపించిన బ్లాక్‌బస్టర్ సినిమా సరిపోలేదేమోనని చురకలంటించారు.
‘అమరావతి’కి చట్టబద్ధత రావొచ్చు..
అమరావతి తీర్మానానికి రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలు ఆనందిస్తున్నారు.. రాష్ట్రంలో మరోసారి తుగ్లక్ చర్యలు చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని మండిపడ్డారు. ఈ రాత్రికి అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి వెళ్తుంది.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ‘అమరావతి’కి చట్టబద్ధత రావొచ్చని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఏపీ అసెంబ్లీ.. రాజధాని చట్టబద్ధత తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు






