జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు : మంత్రి నారాయణ

by Naga Rani Yarlagadda |

వైఎస్ జగన్ కుటుంబానికి ఉన్న రక్త చరిత్ర గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి నారాయణ విమర్శించారు.

జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ కుటుంబానికి ఉన్న రక్త చరిత్ర గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి నారాయణ విమర్శించారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబ రక్త చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియడం వల్లే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా మిగలవని మంత్రి నారాయణ జోస్యం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేటాయించిన నిధులను ఎందుకు వినియోగించలేదో జగన్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ భారత్ నిధులను కూడా జగన్ సర్కార్ దారి మళ్లించిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తోంటే.. ఉద్దేశపూర్వకంగానే జగన్ అండ్ కో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక టీడీపీ అధిష్ఠానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈసారి వర్చువల్ గా వేడుకలు జరుగుతాయని మరోసారి గుర్తుచేశారు. వర్చువల్ మహానాడులోనూ రాజకీయ తీర్మానాలు, ఆమోదాలు ఉంటాయని తెలిపారు.

Next Story