- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పక్కా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
మూడేళ్లలో అమరావతి రాజధాని పూర్తి అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. ల్యాండ్ పూలింగ్ చేయడం, లే అవుట్ డిజైన్, ఐకానిక్ టవర్స్ కోసం సమయం తీసుకోవడం వల్లనే గతంలో రాజధాని నిర్మాణం

దిశ, వెబ్ డెస్క్: మూడేళ్లలో అమరావతి రాజధాని పూర్తి అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. ల్యాండ్ పూలింగ్ చేయడం, లే అవుట్ డిజైన్, ఐకానిక్ టవర్స్ కోసం సమయం తీసుకోవడం వల్లనే గతంలో రాజధాని నిర్మాణం పూర్తి చేయలేకపోయామని చెప్పారు. టార్గెట్ ఇచ్చామని, ఆ టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేస్తున్నారని చెప్పారు. గత ఏడాదిలోనే టెండర్లను పిలిచి పనులు అప్పగించామని అన్నారు. అందులో కూడా తొమ్మిది నెలలు పని జరిగిందని చెప్పారు.
ఎవ్వరికీ అనుమానం అవసరం లేదని కచ్చితంగా మూడు సంవత్సరాల్లో అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరవాత ఏపీలో ప్రత్యేక రాజధాని నిర్మాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా రాజధాని నిర్మాణం కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో కూటమి సర్కార్ అమరావతిని కచ్చితంగా నిర్మించాలని పనులను చకచకా పూర్తి చేస్తుంది. కేంద్రం నుండి కూడా నిధులు రావడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి.






