- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాడి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో విక్రయించవచ్చు.. విజయ మంత్రి లోకేశ్ ట్వీట్
పాడి ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించుకోవచ్చని మంత్రి నారా తెలిపారు. విజయ డెయిరీ వివాదంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: పాడి ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించుకోవచ్చని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విజయ డెయిరీ వివాదంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై లోకేశ్ మాట్లాడారు. తమరు చేసిన ఆరోపణలపై తాము సమీక్షిస్తున్నామని తెలిపారు. విజయ డెయిరీ పాలు శ్యాంపిల్స్‌ను తీసుకుని ఏపీడీడీసీఎఫ్ నాణ్యత పరీక్షలను నిర్వహిస్తోందని తెలిపారు. సీఏఎల్ఎఫ్-ఎన్డీడీబీ పరీక్ష నివేదికలనూ పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో ర్యాండమ్‌గా శాంపిల్స్ సేకరిస్తున్నారని పేర్కొన్నారు. వన్ నేషన్, వన్ మార్కెట్ అనేది మోడీ నినాదమని, పాడి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయించవచ్చని తెలిపారు. నాణ్యత, వినియోగదారుల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ఏపీ విజయ డెయిరీ పేరుతో మేఘన అనే సంస్థ కల్తీ పాలు అమ్ముతోందని గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ విజయ డెయిరీ పేరుతో పాడి ఉత్పత్తులు విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే తెలంగాణ విజయ డెయిరీ పాల ప్యాకెట్‌ను కొద్ది మార్పు చేసి ఏపీలో విక్రయిస్తున్నారు. తద్వారా తెలంగాణ విజయ డెయిరీకి పేరు చెడిపోతోందని గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి కూడా తాను విజ్ఞప్తి చేసింది. వైఎస్ జగన్ హయాంలో ఏపీ విజయ డెయిరీ అనుతులు తీసుకుని గుజరాత్‌లో పాడి ఉత్పత్తులు తయారు చేసి ఏపీలో అమ్ముతున్నారని అమిత్ రెడ్డి తెలిపారు. అయితే అమిత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించి సమాధానం ఇచ్చారు.






