- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రోజు కన్నీళ్లు ఆగలేదు: మంత్రి నారా లోకేశ్ వీడియో వైరల్
ఆ రోజు తనకు కన్నీళ్లు ఆగలేదని మంత్రి నారా లోకేశ్ వీడియో వైరల్ అవుతున్నాయి....

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu naidu) 2024 ఎన్నికలకు ముందు అరెస్టై అయి రాజమండ్రి జైలు(Rajahmundry Jail)కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పడి బాధలు అంతా ఇంత కాదు. తండ్రి అరెస్ట్ నుంచి ప్రతి సెకను చాలా కష్టంగా గడిచేది. ప్రతి నిమిషం తండ్రి ఎంతో బాధపడుతున్నారోనని లోకేశ్ ఆవేదన చెందేవారు. పార్టీ నేతల వద్ద పైకి సంతోషంగా ఉన్నట్టు కనిపించినా లోలోపల నలిగిపోయేవారు. జైలులో తండ్రి ఏమన్నా జరుగుతుందోనని ఆందోళన చెందేవారు. ఇక చంద్రబాబు అరెస్ట్ అయిన రోజును మాత్రం నారా లోకేశ్ మర్చిపోలేరు. ఎందుకంటే అంతలా కన్నీళ్లు పెట్టుకుని కుమిలిపోయారు. జైల్లో ఉన్న తండ్రిని చూసి ఆయన గుండు తరుక్కుపోయింది. ఇక పార్టీ పరిస్థితిపైనా ఆందోళన చెందేవారు. భవిష్యత్తు ఏంటనే ప్రశ్న ఆయన్ను చాలా కుంగదీసింది. అయినా సరే తట్టుకుని నిలబడ్డారు. కూటమికి బాట వేశారు. 53 రోజుల తర్వాత తండ్రి చంద్రబాబుకు బయట వచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి.. భారీ విజయం సాధించారు. మంత్రిగా లోకేశ్(Minister Lokesh) పగ్గాలు కొనసాగించారు. ఈ విషయాలన్నింటినీ ఓ టీవీ చానల్ నిర్వహించిన పాడ్ కాస్ట్‌లో మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో పలు కేసుల్లో వైసీపీ నేతలు జైలుకు వెళ్తున్న సమయంలో మంత్రి నారా లోకేశ్ టీవీ కార్యక్రమంలో పంచుకున్న ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటే మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు.






