- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌ను అవమానించేలా ట్వీట్..! తప్పుబట్టిన మంత్రి నారా లోకేష్ ట్వీట్ వైరల్
సోషల్ మీడియాలో వివిధ పార్టీల శ్రేణులు ఏఐ ఉపయోగించి ప్రత్యర్థి రాజకీయ నాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అవమానించేలా పోస్ట్‌లు చేస్తుంటారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో వివిధ పార్టీల శ్రేణులు ఏఐ ఉపయోగించి ప్రత్యర్థి రాజకీయ నాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అవమానించేలా పోస్ట్‌లు చేస్తుంటారు. వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం జగన్‌ను అవమానించేలా ట్వీట్ చేసిన తన కార్యకర్తను టీడీపీ అగ్రనేత మంత్రి నారా లోకేష్ తప్పుబట్టారు. ఈ మేరకు టీడీపీ కార్యకర్త వేసిన జగన్ ఏఐ వీడియోపై స్పందిస్తూ మంత్రి లోకేష్ స్పందించారు. మంగళవారం ఎక్స్ వేదకగా ఆ పోస్టును రీ ట్వీట్ చేశారు. ట్వీట్‌లో.. ‘నా ప్రియమైన టీడీపీ కుటుంబ సభ్యులారా.. ఇటువంటి కంటెంట్ వెనుకున్న భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకున్నాను. అయితే వ్యక్తిగత దాడులు ఎప్పుడూ మంచివి కావు. మనం రాజకీయ ప్రత్యర్థులమై ఉండొచ్చు, కానీ మన ప్రజా సంభాషణ గౌరవం, మర్యాదలపై ఆధారపడాలి. మా అనుచరులు సహా అందరూ ఇలాంటి కంటెంట్‌ను ప్రచారం చేయకుండా ఉండాలని నేను కోరుతున్నాను. విభేదాల్లోనూ సంస్కారాన్ని పాటిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి పెడుదాం’ అని ట్వీట్‌లో మంత్రి పేర్కొన్నారు.
కాగా, @Vasireddytdp123 అనే యూజర్ మాజీ సీఎం జగన్‌ను విమర్శిస్తూ ఏఐ వీడయో పోస్ట్ చేశారు. ఏఐ వీడియో ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఉన్నారు. మరోవైపు వారు వస్తున్న సమయంలో మాజీ సీఎం జగన్ రోడ్డుపై ప్లకార్డు పట్టుకొని కూర్చోని ఉన్న జగన్‌ని చూపించారు. ప్లకార్డులో దయ చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అభ్యర్ధిస్తున్నట్లుగా ఏఐ వీడియోలో చూపించారు. ఈ పోస్టును మంత్రి లోకేష్ రీ ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇలా ప్రతి ఒక్కరు మంత్రి లోకేష్‌లా ఉంటే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నెటిజన్‌లు అభినందించారు. అది మా లీడర్ అంటే అని టీడీపీ సోషల్ మీడియా శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. ట్వీట్ ఇదే..






