ఆధునిక నగర నిర్మాణంపై మంత్రి నారా లోకేశ్ ఆలోచనాత్మక ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-12-25 13:03:53  IST  )

ఆధునిక నగరాల రూపకల్పనపై మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఎక్స్ వేదికగా చర్చనీయాంశంగా మారింది.

ఆధునిక నగర నిర్మాణంపై మంత్రి నారా లోకేశ్ ఆలోచనాత్మక ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆధునిక నగరాల రూపకల్పనపై మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఎక్స్ వేదికగా చర్చనీయాంశంగా మారింది. లింక్డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణాత్మక పోస్టును ప్రస్తావించిన ఆయన, నగరాల అభివృద్ధి భావోద్వేగాల ప్రదర్శనగా కాకుండా స్పష్టత, క్రమశిక్షణ, కార్యాచరణాత్మక ప్రణాళికలపై ఆధారపడాలని అభిప్రాయపడ్డారు.

నగర నిర్మాణంలో ‘సోల్’ అనే పేరుతో అధిక నాటకీయతకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం లేదని, బదులుగా సమర్థవంతమైన ప్రణాళిక, సమయపాలన, పని చేసే వ్యవస్థలే అసలైన బలమని ఆయన పేర్కొన్నారు. మౌలిక వసతులు నమ్మకంగా పనిచేసే విధంగా ఉండాలి, నియమాలు స్పష్టంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ప్రజలు ఆటంకాలు లేకుండా జీవించేందుకు, ఆశయాలను సాధించేందుకు స్వేచ్ఛ లభిస్తుందని ఆయన ట్వీట్‌లో తెలిపారు.

మంచి నగరాలకు హడావుడి అవసరం లేదని, భావోద్వేగాల ఆర్భాటం అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. క్రమశిక్షణ, సమర్థవంతమైన అమలు, నిరంతర పర్యవేక్షణే సుస్థిర నగరాభివృద్ధికి మూలమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరాలు ప్రజల జీవితాలను సులభతరం చేయాల్సిందే కానీ, భావాల ప్రదర్శన వేదికలుగా మారకూడదని ట్వీట్‌లో నారా లోకేశ్ పేర్కొన్నారు.

Next Story