- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి లోకేశ్ పెట్టుబడుల వేట.. ముంబై సంస్థలకు ఆహ్వానం
మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది....

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) పెట్టుబడుల వేట కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో పర్యటించి పలు కంపెనీల సీఈవోలను కలిశారు. ఏపీలో పెట్టుబడులు(Investments) పెట్టాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూల వాతావరణాన్ని వివరించారు. ఈ మేరకు పలు కంపెనీలు రాష్ట్రంలో నెలకొల్పేందుకు ఆయా యాజమాన్యాలు అంగీకరించారు. ఇందులో భాగంగా పలు కంపెనీలు రాష్ట్రంలో కార్యాచరణను ప్రారంభించాయి. ఇంకా మరిన్ని పెట్టుబడుల కోసం దేశంలోనూ ఆయన పర్యటిస్తున్నారు.
తాజాగా ముంబై(Mumbai)లో మంత్రి లోకేశ్(Minister Lokesh) పర్యటించారు. లాజిస్టిక్స్, చమురు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పేరెన్నికగన్న ట్రాఫిగురా ఇండియా (Trafigura India) సీఈవో సచిన్ గుప్తాను కలిశారు. ఏపీలో కోల్డ్ స్టోరేజి, ఎగుమతి మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. భారత్‌లో ఏపీ ప్రధాన బియ్యం ఉత్పత్తిదారు మాత్రమే కాకుండా, దేశం మొత్తం మీద 70 శాతం రొయ్యలు ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. విశాఖపట్నం, కాకినాడ పోర్టుల్లో సరుకు నిల్వలకు అధునాతన వేర్ హౌసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకుపోతున్న ఏపీలో విద్యుత్ వాణిజ్యంలో భాగస్వామ్యం వహించండని సూచించారు. కాకినాడ లేదా విశాఖపట్నంలో ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్‌ను ఏర్పాటుచేసి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో కమోడిటీ ట్రేడింగ్ డెస్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
అనంతరం టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. టాటా పవర్ రెన్యూవబుల్స్ (Tata Power Renewables) ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రూఫ్‌టాప్ సోలార్ అభివృద్ధి చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే మార్గాన్ని అన్వేషించాలని, రాష్ట్రంలో సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ కంపెనీల ఏర్పాటు కావాల్సిన అనుకూల వాతావరణాన్ని వివరించారు.






