- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ క్రెడిట్ సీఎం చంద్రబాబుకే’.. మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని.. పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో అందరూ చూస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని.. పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో అందరూ చూస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో APNRT ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారు ఉన్నారంటే ఆ క్రెడిట్ సీఎం చంద్రుబాబుకే దక్కుతుందన్నారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు శాసించేందుకు ఆయన విజనరీ కారణమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది నందమూరి తారక రామారావు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఆనాడు ఐటీ అంటే కంప్యూటర్లు తిండి పెడతాయా? అని కొందరు విమర్శలు చేశారు. అలాగే, సీఎం చంద్రబాబు ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేసినప్పుడు కూడా విమర్శించారు. కానీ ఈ రోజు ఆ కంప్యూటర్లతోనే తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఆది విజనరీ అంటే.. అదీ సీబీఎన్ బ్రాండ్ అని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. సింగపూర్‌లో జరుగుతున్న ఈ తెలుగు ప్రవాసుల సమావేశానికి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇతర ఫార్ ఈస్ట్ దేశాల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారని తెలిపారు.
ఇక, ఏపీలో గత ఐదేళ్లలో సైకో పాలన, విధ్వంస పాలన చూశాం అన్నారు. ఎన్నికల సమయంలో కొందరు దాదాపు ఆరు నెలలు ఏపీకి వచ్చి కష్టపడ్డారు. గతంలో చంద్రబాబు అరెస్టయినప్పుడు ఇదంతా మనకు అవసరమా అని నారా బ్రాహ్మణి అడిగింది. అదే సమయంలో హైదరాబాద్‌లో 45 వేల మంది ఐటీ నిపుణులు చంద్రబాబు వెంట ఉంటామని చెప్పారు. ఐటీ నిపుణులు అండగా నిలబడ్డారు. అదే మాకు కొండంత ధైర్యం ఇచ్చిందని మంత్రి లోకేష్ వెల్లడించారు. తెలుగు జాతి అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచేందుకు కష్టపడాలని ఆ రోజే నిర్ణయించుకున్నా అన్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.






