- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
4 రోజులు.. 45 భేటీలు! విజయవంతంగా ముగిసిన మంత్రి నారా లోకేశ్ దావోస్ టూర్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) పర్యటన విజయవంతంగా ముగిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో లోకేశ్ అత్యంత చురుగ్గా వ్యవహరించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో మంత్రి లోకేశ్ ఏకంగా 45 కీలక సమావేశాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన వనరులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుకూలతలను వారికి వివరించారు.
వేల కోట్లకు పైగా పెట్టుబడి ( $10 బిలియన్లు)
ఈ పర్యటనలో సాధించిన అతి పెద్ద విజయం ఆర్ఎంజడ్ (RMZ) సంస్థతో కుదిరిన ఒప్పందం. లోకేశ్ చొరవతో ఈ సంస్థ ఏపీలో సుమారు $10 బిలియన్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనుంది.
తిరుగు పయనం
దావోస్ పర్యటన ముగించుకున్న మంత్రి లోకేశ్ శనివారం హైదరాబాద్ చేరుకోనున్నట్లు అధికారుల సమాచారం. మొత్తానికి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడంలో లోకేశ్ దావోస్ పర్యటన కీలక మైలురాయిగా నిలిచింది.






