- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటికి పిలిచి భోజనం పెట్టి సన్మానించినప్పుడు ఏమైంది జగన్: లోకేష్ కౌంటర్
కల్తీ మద్యం(Adulterated liquor) విషయంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్(Jagan) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కల్తీ మద్యం(Adulterated liquor) విషయంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్(Jagan) తీవ్ర విమర్శలు చేశారు. నకిలీ మద్యం తయారీలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా చేయాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జగన్‌కు మంత్రి లోకేష్(Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేష్ పోస్టు పెట్టారు.
‘‘డియర్ జగన్.. కల్తీ మద్యం వ్యవహారాన్ని పట్టుకున్నదే మా ప్రభుత్వం. కల్తీ మద్యం నిందితుల్లో టీడీపీ నేతలున్నా అరెస్ట్ చేయించింది మా ప్రభుత్వం. నిందితుల్లో ఇద్దరు మా పార్టీ వారుంటే తక్షణమే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో మరిచిపోయి ఆరోపణలు చేయొద్దు. డబ్బు కక్కుర్తితో జే బ్రాండ్స్‌తో వేల మంది ప్రజల ప్రాణాలు తీశారు. మీ జమానాలో జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే, సహజమరణాలని నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. `పోతే పోయారు... ఇంకా ఏడుస్తారేంటి?` అని మీ మంత్రి జోగి రమేష్ అహంకారం ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకున్నారు. దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన మీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని అప్పటి నుంచి ఇప్పటివరకూ పార్టీ నుంచి కనీసం సస్పెండ్ చేయలేదు, సరికదా ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టి సన్మానించారు. కల్తీ మద్యం గురించి, నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది జగన్’’ అని లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.






