ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్! జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు లోకేశ్ విషెస్

by Ramesh Naini |

సీడాప్ శిక్షణతో జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతను ఉండవల్లి నివాసంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ అభినందించారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్! జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు లోకేశ్ విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీడాప్ శిక్షణతో (Germany) జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతను ఉండవల్లి నివాసంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అభినందించారు. సీడాప్ ద్వారా 5 ఏళ్లలో 50 వేల మందికి విదేశీ ఉద్యోగాలు లక్ష్యంగా పని చేస్తున్నామని ఈ సందర్భంగా లోకేశ్ తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు సీడాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు.. ఇకపై చదువుతోపాటే విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ & ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (SEEDAP), ఇండో యూరో సింక్రనైజేషన్ & జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం (నర్సింగ్ ప్రొఫెషనల్స్) (Overseas Placement scheme) కింద 14మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయని తెలిపారు. తొలిబ్యాచ్ లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణ ఇవ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఎంపికయ్యారని, వారిలో 14 మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారని పేర్కొన్నారు. మిగిలిన అభ్యర్థులు కూడా వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేస్తున్నారని, వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మన రాష్ట్రంలోని బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఉద్యోగాల కల్పించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం అని. ఆ లక్ష్యానికి అనుగుణంగా సీడాప్- ఓంక్యాప్ లను బలోపేతం చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.

Next Story