అందమైన బొమ్మరిల్లు..! టీచర్ నవీన్ కుమార్‌కు మంత్రి లోకేశ్ విషెస్

by Ramesh Naini |

ఏపీలో కూటమి ప్రభుత్వం సర్కార్ పాఠశాలల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది.

అందమైన బొమ్మరిల్లు..! టీచర్ నవీన్ కుమార్‌కు మంత్రి లోకేశ్ విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో కూటమి ప్రభుత్వం సర్కార్ పాఠశాలల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలను అభివృద్ధి వైపు నడిపిస్తూ.. ఆటపాటలతో చదువు చెబుతున్న టీచర్లను సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఓ స్కూల్‌ను ఓ టీచర్‌కు మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

‘శిథిలావస్థకు చేరిన బడిని తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, అధికారుల సహకారంతో అందమైన బొమ్మరిల్లులా తీర్చిదిద్దిన అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం వన్నాడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల టీచర్ నవీన్ కుమార్‌కి అభినందనలు. అందమైన ఉద్యానవనంలా తయారైన బడిలో, పిల్లలను ఆటపాటలతో అలరిస్తూ, చదువు చెబుతున్న ఉపాధ్యాయుడి కృషి ప్రశంసనీయం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు స్కూల్‌కు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. వీడియో ఇదే..

Next Story