- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ మహానాడు.. మంత్రి నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు?
చరిత్రలో నిలిచిపోయేలా కడపలో టీడీపీ మహానాడు (TDP Mahanadu) నిర్వహించాలని అధిష్ఠానం తీర్మానించింది. సీమలో టీడీపీ మహానాడు నిర్వహించనుండటం ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది. గతేడాది ఎలక్షన్ కోడ్ (Election Code) కారణంగా మహానాడు నిర్వహించడం సాధ్యం కాలేదు.

దిశ, వెబ్‌డెస్క్: చరిత్రలో నిలిచిపోయేలా కడపలో టీడీపీ మహానాడు (TDP Mahanadu) నిర్వహించాలని అధిష్ఠానం తీర్మానించింది. సీమలో టీడీపీ మహానాడు నిర్వహించనుండటం ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది. గతేడాది ఎలక్షన్ కోడ్ (Election Code) కారణంగా మహానాడు నిర్వహించడం సాధ్యం కాలేదు. ఈ ఏడాది మే 27,28,29 తేదీల్లో మహానాడును నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలిట్ బ్యూరో (TDP Polit Bureau) సమావేశంలో చెప్పారు. కాగా.. ఎన్నికలకు ముందు ఏపీలో యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన నారా లోకేష్.. వారి సమస్యల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి యువతలో విశేష ఆదరణను పొందారు.
ఇప్పుడు మహానాడులో నారా లోకేష్‌కు యువతకు సంబంధించిన కీలక బాధ్యతల్ని అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. యువతకు ప్రాధాన్యత ఇస్తూ, కొత్త తరం నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహానాడులోనే మంత్రి లోకేష్ (Minister Nara Lokesh)కు కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, అండగా నిలబడే లోకేష్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు నుంచే కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తూ.. 2014 ఎన్నికలకు ముందు నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలెవరైనా సరే.. ప్రమాదంలో మరణించిన వెంటనే ఆర్థిక సహాయం అందేలా వారికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ.. కార్యకర్తల మనిషిగా గుర్తింపు పొందారు లోకేష్. ఈ క్రమంలో ఆయనకు పార్టీ కార్యకలాపాలను చూసుకునే బాధ్యతలను అప్పగించాలన్న డిమాండ్ పెరిగింది. మూడు రోజులపాటు జరగనున్న మహానాడులో.. చివరి రోజున లోకేష్‌కు కీలక బాధ్యతలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.






