- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Defamation Case: క్రాస్ ఎగ్జామినేషన్‌కు మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్‌కు క్రాస్ ఎగ్జిమినేషన్ జరగనుంది...

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)కు క్రాస్ ఎగ్జిమినేషన్(Cross Examination) జరగనుంది. ఓ పత్రికపై ఆయన వేసిన పరువు నష్టం దావా(Defamation Suit)పై విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టు(Visakha 12th Additional District Court) విచారణ చేపట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ధర్మాసనం ఎదుట హాజరుకానున్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిందంటూ లోకేశ్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆయన కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.
తాజాగా కూడా కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఆయన అమరావతి(Amaravati) నుంచి విశాఖ(Visakha)కు ఆదివారమే చేరుకున్నారు. ఈ రోజు కోర్టుకు హాజరై తన వాదనలను వినిపించనున్నారు. దీంతో నారా లోకేశ్ కోర్టుకు హాజరయ్యే విషయాన్ని పార్టీ వర్గాలు బయటకు తెలిపాయి. అయితే విశాఖ ఎయిర్ పోర్టు(AirPort)కు చేరుకున్న లోకేశ్‌ను పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాత్రి బసకు నగరంలోనే ఏర్పాటు చేశారు.






