ప‌వ‌న‌న్న‌కు ధ‌న్య‌వాదాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ విషెస్.. ఎందుకంటే?

by Ramesh Naini |

ప‌వ‌న‌న్న‌కు ధ‌న్య‌వాదాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ విషెస్.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మంత్రి నారా లోకేష్ విషెస్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. చిలకలూరిపేట శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 3.0కి హాజ‌రైన ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాని తెలిపారు. శార‌దా జెడ్పీ హైస్కూలు లైబ్ర‌రీకి పుస్త‌కాలు, ర్యాక్‌లు, 25 కంప్యూట‌ర్లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న‌న్న‌కు ధ‌న్య‌వాదాలు అంటూ పేర్కొన్నారు. ఏపీ మోడ‌ల్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ ద్వారా మ‌న విద్యావ్య‌వ‌స్థ‌ను 2029 నాటికి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా తీర్చిదిద్దేందుకు డిప్యూటీ సీఎం అందిస్తున్న స‌హ‌కారం, ప్రోత్సాహం ఎన‌లేనిదని ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ట్వీట్ ఇదే..

Next Story