ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి నారా లోకేష్.. ఆరు రోజులు అక్కడే

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు భయలుదేరనున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి నారా లోకేష్.. ఆరు రోజులు అక్కడే
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మరోసారి విదేశీ పర్యటనకు భయలుదేరనున్నాడు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులే లక్ష్యంగా చేసుకొని ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న CII సదస్సు కోసం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చేసుకొని సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో మంత్రి లోకేష్ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మొత్తం ఆరు రోజుల పర్యటనలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలతో కూడా లోకేష్ సంప్రదింపులు చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story