సీబీఎన్ అంటే డీఎస్సీ.. డీఎస్సీ అంటే సీబీఎన్ : మంత్రి నారా లోకేష్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-25 12:46:00  IST  )

సీఎం చంద్రబాబు నాయుడు తనకు జీవితకాల గురువని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.

సీబీఎన్ అంటే డీఎస్సీ.. డీఎస్సీ అంటే సీబీఎన్ : మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు తనకు జీవితకాల గురువని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. గురువారం వెలగపూడిలోని సచివాలయం సమీపంలో డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. దేశానికి అధినేత అయినా సరే.. గురువు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిందేనని హితవు పలికారు. తాను టెన్త్ క్లాస్ వరకూ నామమాత్రంగానే చదివానని, ఫండమెంటల్స్ లో నారాయణ లెసన్స్ చెప్పారని తెలిపారు. ఇక అమెరికా వెళ్లినపుడు ప్రొఫెసర్ రాజిరెడ్డి తనకు విద్యావ్యవస్థ గురించి చెప్పారన్నారు. విద్య గురించి తనకు అవగాహన ఉందని, అందుకే తొలి సంతకం డీఎస్సీ ఫైల్ పైనే పెట్టానన్నారు. సీబీఎన్ అంటే డీఎస్సీ.. డీఎస్సీ అంటే సీబీఎన్ అని కొనియాడారు. 150 రోజుల్లో 150 కేసులు పెట్టినా.. డీఎస్సీ పోస్టుల్ని భర్తీ చేసి చూపించామన్నారు. 150రోజుల్లో డిఎస్సీ నిర్వహించడం ఒక చరిత్ర, ఇది నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అని పేర్కొన్నారు.

విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచి.. ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి, పోస్టుల్ని భర్తీ చేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. అందరి సమష్టి కృషి వల్లనే మెగా డీఎస్సీ మెగా హిట్టయిందన్నారు. ఇకపై ప్రతీ సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామన్న మంత్రి.. ఈ ఏడాది నవంబర్ లోనే టెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి చూపిస్తామన్నారు.

Next Story