- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలంటే గొడ్డలి పార్టీకి కక్ష.. ఓ వీడియో షేర్ చేసిన మంత్రి నారా లోకేశ్
బీసీలపై వైసీపీకి కక్ష ఉందని టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. అమర్‌నాథ్ గౌడ్‌ను బలిగొని మూడేళ్లు పూర్తయ్యాయని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్సీపీపై మంత్రి నారా లోకేశ్ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం మంగళవారం అమర్‌నాథ్ గౌడ్ వర్ధంతి సందర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. బీసీలపై గొడ్డలి పార్టీ కక్షగట్టిందని, అమర్ నాథ్ గౌడ్‌ని బలిగొని మూడేళ్లు అయిందని గుర్తుకు చేశారు. అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ల బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్‌ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవదహనం చేశారని తెలిపారు. నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. బీసీలు అంటే జగన్‌కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవదహనం నిరూపించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా నష్టపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు అమర్ నాథ్ గౌడ్ గురించి తన అక్క చెబుతున్న ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు.






