- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా జీవితంలో నిలిచిపోయే మధుర క్షణాలు ఇవే: మంత్రి నారా లోకేశ్
తెలుగు ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్ గత ఏడాదిలో తనను సంతృప్తి పరిచిన అంశాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రజలందరికీ(Telugu people) నూతన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) గత ఏడాదిలో తనను సంతృప్తి పరిచిన అంశాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అవి తాను సాధించిన విజయాలుగా, తన జీవితంలో నిలిచిపోయే మధుర క్షణాలుగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ(Education Department)లో తీసుకొచ్చిన మార్పులపై ప్రధాని మోడీ(Pm Modi) ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేసుకుని లోకేశ్ సంతోషపడ్డారు. స్కూలు పిల్లలు మోస్తున్న పుస్తకాల భారంపై తాను తీసుకున్న ‘నో బ్యాగ్ డే’(No bag day) నిర్ణయం విప్లవాత్మక విజయాన్ని సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి శనివారం స్కూలు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం తీసుకున్న మరో విప్లవాత్మకమైన నిర్ణయం ‘మెగా డీఎస్సీ’ అని గుర్తు చేశారు. నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల ఆశలను నెరవేర్చడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
ఇవీ కీలకమే..
మరో అంశం యోగా డే అని, ఫిట్‌నెస్‌పై యువతకు అవగాహన కల్పించడం, తనకు సైతం నూతనోత్సాహాన్నిచ్చిందని తెలిపారు. 2025లో అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నామని చెప్పారు. ‘మన మిత్ర’(Mana Mitra) పేరుతో సామాన్యుడికి వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఫిర్యాదులు, సలహాలు ప్రజలకు చేరువ చేశామని గుర్తు చేశారు. ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో భేటీ కావడం, ఏపీలో పెట్టుబడులకు సహకారం కోరడం కూడా తాను మర్చిపోలేని మధుర క్షణాలు అని ప్రజలతో మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.






