ఉర్సా కంపెనీ వివాదం.. జగన్‌కు సంచలన సవాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-02 13:39:59  IST  )

ఉర్సా కంపెనీ వివాదంపై మాజీ సీఎం జగన్‌కు మంత్రి నారా లోకేశ్ సంచలన సవాల్ చేశారు...

ఉర్సా కంపెనీ వివాదం.. జగన్‌కు సంచలన సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఉర్సా కంపెనీ(Ursa Company)కి భూ కేటాయింపు వివాదం రాజకీయ రచ్చకు దారి తీసింది. విశాఖలో ‘ఉర్సా కంపెనీ’కి కూటమి ప్రభుత్వం(NDA Government) 60 ఎకరాల భూములు కేటాయించింది. అయితే ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి రూ. 3 వేల కోట్ల భూములు ఎలా భూములు కేటాయిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. పెట్టుబడుల ముసుగులో భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేసింది.

దీంతో మంత్రి నారా లోకేశ్(Minsiter Nara Lokesh) సీరియస్ అయ్యారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)కి సంచలన సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు తప్పు అని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖ ఐటీ పార్క్ సిటీలో ఎకరం కోటి రూపాయల చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని తెలిపారు. కాపులుప్పలపాడు(Kapuluppalapadu)లో ఎకరం రూ.50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు రావడం జగన్ ఓర్వలేకపోతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు.

Next Story