- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీచర్లు, ఇన్విజిలేటర్లు ఉండరు... 32 సార్లు పరీక్షలు రాశా: మంత్రి నారా లోకేశ్
టీచర్లు, ఇన్విజిలేటర్లు ఉండరని, నీతిగా 32 సార్లు పరీక్షలు రాశానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: పిల్లల్లో తనకు దేవుడు కనిపిస్తాడని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ‘‘విలువల విద్యా సదస్సు’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువగళంలో పిల్లలు టీడీపీ చొక్కా వేసుకుంటే బాధ కలిగేదని చెప్పారు. తాను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశానని, అయితే చాలా మంది తనను అక్కడ ఏం నేర్చుకున్నావని అడిగారని తెలిపారు. అయితే స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీలో జరిగే పరీక్షలకు టీచర్లు, ఇన్విజిలేటర్లు ఉండరని స్పష్టం చేశారు. పరీక్ష పేపర్లు తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్లిపోతారని తెలిపారు. ఆ సమయంలో ఎవరూ కాపీ కొట్టకుండా పరీక్షల రాస్తారని, అలా తాను 32సార్లు ఎగ్జామ్స్ రాశారని చెప్పారు. అంత నీతిగా అక్కడ పరీక్ష జరుగుతుందని, అలా అక్కడ నైతిక విలువలు ఉంటాయన్నారు. రాష్ట్ర విద్యార్థులకు కూడా అలాంటి నైతిక విలువలు చాలా అవసరమన్నారు. సత్యసాయి జయంతి వేడుకలో ఎవరి బాటిల్ వారు తీసుకొని, చిన్న కాగితం ముక్క కూడా చెత్తబుట్టలో వేసి వెళ్లారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.






