- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మగవాళ్లకన్నా ఈ అక్కే అద్భుతంగా ఆటో నడిపారు: నారా లోకేశ్
ఆవకాయ్ పట్టాలన్నా .. అంతరిక్షానికి వెళ్లాలన్నా.. ఆటో తోలాలి అన్నా మహిళలేనని మంత్రి నారా లోకేశ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఆవకాయ్ పట్టాలన్నా .. అంతరిక్షానికి వెళ్లాలన్నా.. ఆటో తోలాలి అన్నా మహిళలేనని మంత్రి నారా లోకేశ్(minister Nara Lokesh) అన్నారు. ఆటో(Auto)వాలాకు రూ. 15 వేలు పథకం ప్రారంభానికి ముందు స్వర్ణలత అనే మహిళకు చెందిన ఆటోలో ఆయన ప్రయాణం చేశారు. స్వయంగా ఆమెనే ఆటో డ్రైవ్ చేయడంతో లోకేశ్ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా ఆటో డ్రైవర్ స్వర్ణలత ఇంట్లో కష్టాలు తాను తెలుసుకున్నానని చెప్పారు. మగవాళ్లకన్నా ఆ అక్కే అద్భుతంగా ఆటో నడిపారని తెలిపారు. స్వర్ణలత ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారన్నారు. ఇంట్లో ఆమె భర్త సహకరిస్తున్నారని, కలసికట్టుగా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారని, పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారని లోకేశ్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆవిడకు అందాయని లోకేశ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం వచ్చిందని, దీపం పధకంలో సిలెండర్లు వచ్చాయని, వారి అత్తగారికి ప్రజాప్రభుత్వంపెన్షన్ ఇస్తుందని ఆమె చెప్పినట్లు లోకేశ్ తెలిపారు. మహిళల్ని గౌరవిస్తేనే సమాజం బాగుపడుతుందని, మహిళలను కించపర్చేపదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. తప్పుడు పదాల వాడకూడదని, మహిళలను గౌరవించడంపై ప్రతి ఆటోడ్రైవర్ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.






