- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని ఎదుట బాలయ్య డైలాగుతో రెచ్చిపోయిన మంత్రి లోకేశ్
ప్రధాని మోడీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమేనని మంత్రి నారా లోకేశ్ తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Pm Modi) ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమేనని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తెలిపారు. కర్నూలులో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’(Super GST- Super Savings) బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. దేశం కోసం ప్రధాని మోడీ ప్రతినిత్య కష్టపడుతున్నారని చెప్పారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్‌ను శక్తివంతమైన రాష్ట్రంగా మార్చారని తెలిపారు. ప్రధానిగా ఇప్పుడు భారత్‌ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్(Trump) సుంకాలు పెంచితే అన్ని దేశాలు వణికిపోయాయని చెప్పారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదనేది నమో స్టైల్ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ గుండె ధైర్యం ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పారు. ప్రధానికి దేశ ప్రజలంటే నమ్మకమని, తమకు నమో అంటే నమ్మకని తెలిపారు. బ్రిటీష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పుట్టిన నేల ఇది అని, ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు అని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.






