- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి చేశాం కాబట్టే ఆ ప్రాంతం ఐదో స్థానంలో ఉంది: మంత్రి లోకేశ్
అభివృద్ధి చేశాం కాబట్టే ఆ ప్రాంతం ఐదో స్థానంలో ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అమరావతి చట్టబద్ధత తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా 2014-19 సమయంలో జరిగిన అభివృద్ధి ఆయన కీలక విషయాలు గుర్తు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: అభివృద్ధి చేశాం కాబట్టే ఆ ప్రాంతం ఐదో స్థానంలో ఉందని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తెలిపారు. అమరావతి చట్టబద్ధత తీర్మానంపై అసెంబ్లీ(Assembly)లో చర్చ సందర్భంగా 2014-19 సమయంలో జరిగిన అభివృద్ధి ఆయన కీలక విషయాలు గుర్తు చేశారు. ఒకప్పుడు అనంతపురం(Ananthapuram) చాలా వెనుకబడి ఉండేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత క్రియా పరిశ్రమను తీసుకొచ్చామని తెలిపారు. కియా పరిశ్రమ(kia Industry) రావడం వల్ల అనంతపురం ఇప్పుడు ఐదో స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాయలసీమను హార్టికల్చర్ ద్వారా డెవలప్ మెంట్ చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర(Uttarandra)కు చాలా కంపెనీలను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని 2019-24 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చెప్పలేదా అని ప్రశ్నించారు. రాజధాని వల్ల చాలా మంది జీవితాల్లో మార్పులు వచ్చాయన్నారు. రాజధానిగా అమరావతిని చేయడం వల్లే అక్కడి భూముల ధరలు పెరిగాయన్నారు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఏపీ రాజధానిని నిర్మించేందుకు సీఎం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.






