మంగళగిరికి మహర్దశ.. మంత్రి ప్రకటించిన వరాలివే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-13 10:37:00  IST  )

దేశంలోనే నెంబర్ వన్‌గా మంగళగిరిని మారుస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు...

మంగళగిరికి మహర్దశ..  మంత్రి ప్రకటించిన వరాలివే..!
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే నెంబర్ వన్‌గా మంగళగిరి(Mangalagiri)ని మారుస్తామని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తెలిపారు. మంగళగిరిలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన ఆయన తన నియోజకవర్గం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మంగళగిరి రూపురేఖలు మారబోతున్నాయని జోస్యం చెప్పారు. 2019లో తనను మంగళగిరి ప్రజలు ఓడించినా తాను బాధపడలేదని చెప్పారు. కానీ అదే ప్రజలు 2024లో భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా మంగళగిరి ప్రజల కోసం తన సొంత నిధులతో 26 కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మంగళగిరి లక్ష్మి నరసింహా స్వామి టెంపుల్‌ను టూరిజం ప్యాకేజీతో అభివద్ధి చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరంలోనే 100 పడకల ఆస్పత్రిని పూర్తి చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.



ఎన్నికలకు ముందు హామీ ఇచ్చానని, ఇప్పుడు నెరవేరుస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్నొన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుండేలా చేసే బాధ్యత తాను తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే మంగళగిరి పేదలకు రూ. 1000 కోట్ల విలువైన భూమి ఇచ్చినట్లు గుర్తు చేశారు. మంగళగిరి కోసం జారీ చేసి జీవోలు ప్రస్తుతం రాష్ట్రమంతా పనికొస్తున్నాయని చెప్పారు. జూన్ నెల నుంచి భూగర్భ డ్రైనేజ్, గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు రెండేళ్లలో అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి-తెనాలి మధ్య PPP మోడ్‌లో తొలి 4 లేన్ల రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే రూ. 300 కోట్లతో కృష్ణా నది వెంట రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. మహానాడు కాలనీ రిటైనింగ్ వాల్‌కు త్వరలోనే పనులు చేపట్టబోతున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

Next Story