ఏపీలో సోషల్ మీడియా బ్యాన్‌పై స్టడీ చేస్తున్నాం: లోకేశ్

by Vemula.Srinu Prasad |

ఏపీలో సోషల్ మీడియా బ్యాన్‌పై స్టడీ చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు..

ఏపీలో సోషల్ మీడియా బ్యాన్‌పై స్టడీ చేస్తున్నాం: లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో సోషల్ మీడియా(Social Media) ఏ విధంగా రెచ్చిపోతోందో అందరికీ తెలిసిందే. మంచికి, హానికి కూడా ఈ మాధ్యమం ఉపయోగపడుతోంది. దీంతో సోషల్ మీడియాను బ్యాన్(Ban) చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించిన ఓ రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా బ్యాన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా యువత మాత్రం సోషల్ మీడియా ఉండాల్సిందేనని అంటున్నారు. పెద్ద వయసు వారు సోషల్ మీడియా కంటెంట్లపై నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో మాత్రం సోషల్ మీడియాపై నిషేధించాల్సిందేనని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మాత్రం చిన్న పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకూడదనే నిబంధనను అక్కడి ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. దీంతో ఈ అంశంపై మన దేశం(Nation)లోనూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం(AP Govt) సైతం ఈ బాటలోనే నడుస్తోంది.

సోషల్ మీడియా బ్యాన్‌పై...

అయితే ఈ అంశంపై డావోస్‌లో ఉన్న మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పందించారు. రాష్ట్రంలో సోషల్ మీడియా బ్యాన్‌పై స్టడీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా(Australia)లో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడం నిషేధమని తెలిపారు. ఈ మేరకు ఏపీ(Ap)లో కూడా అమలు చేసేందుకు స్టడీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట వయస్సుకంటే తక్కువ ఉన్నవారు ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లో ఉండకూడదని మంత్రి నారా లోకేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story