- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీజీఎస్‌పై లోకేష్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ పనులన్నీ జులై నాటికి పూర్తికావాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు....

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ పనులన్నీ జులై నాటికి పూర్తికావాలని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఆదేశించారు. అమరావతి సచివాలయం ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Amaravati Secretariat RTGS Command Control Centre)లో ఆర్టీజీఎస్‌తోపాటు ఎల్‌నినో ప్రభావం, విద్యుత్ సరఫరాపైనా ఆయన సమీక్ష నిర్వహించారు.
అడ్డంకులన్నీ తొలగించండి...
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలన్నారు. అలాగే రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రజల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై మరింతగా అవగాహన కలిగేలా నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులు, అభ్యర్థులకు విద్యా-క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లన్నీ అభ్యర్థి ఆధార్ నెంబర్ ఆధారంగా ఇవ్వాలన్నారు. అంతేకాదు డీజీ వెరిఫై ద్వారా పారదర్శకంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.






