ఏజెంట్ చేతిలో మోసపోయిన పశ్చిమగోదావరి మహిళ.. స్పందించిన మంత్రి నారా లోకేశ్

by Ramesh Naini |   (  Updated:2025-12-26 18:16:54  IST  )

ఉద్యోగం పేరుతో మోసపోయి మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సంపూర్ణ అనే మహిళ తనను వెంటనే స్వదేశానికి రప్పించాలని వేడుకుంది.

ఏజెంట్ చేతిలో మోసపోయిన పశ్చిమగోదావరి మహిళ.. స్పందించిన మంత్రి నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగం పేరుతో మోసపోయి మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సంపూర్ణ అనే మహిళ తనను వెంటనే స్వదేశానికి రప్పించాలని వేడుకుంది. ఓ ఏజెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మస్కట్‌కు పంపి మోసం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆమె అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, ‘పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సంపూర్ణ ఏజెంట్ మోసంతో మస్కట్‌లో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలుసుకొని తీవ్రంగా కలత చెందాను. ఉద్యోగం పేరిట తప్పుడు హామీలతో మోసపోయిన తర్వాత ఏ పౌరుడూ అసహాయంగా మిగలకూడదు. ఆమె భద్రతతో పాటు త్వరగా స్వదేశానికి రప్పించేలా సంబంధిత అధికారులతో వెంటనే సమన్వయం చేయాలని నా బృందాన్ని కోరాను. అవసరమైన అన్ని సహాయ చర్యలు అందిస్తాం’ అని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాలతో అధికారులు బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపై చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ట్వీట్ ఇదే..

Next Story