- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తునిలో విద్యార్థినిపై అత్యాచారయత్నం.. ఘటనపై స్పందించిన లోకేశ్
కాకినాడ జిల్లా తుని ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు..

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) తుని(Tuni)లో గురుకుల పాఠశాల బాలికపై వృద్ధుడు నారాయణరావు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) స్పందించారు. గురుకుల పాఠశాల (Gurukulam School) విద్యార్థినిపై అత్యాచారయత్నం ఘటన షాక్‌కు గురిచేసిందని తెలిపారు. పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. ఇలాంటిఘటనలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పటిష్ఠ భద్రత కల్పించాలని ఆదేశించానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
కాగా కాకినాడ జిల్లా తునిలో స్థానిక నేత నారాయణరావు దారుణానికి ఒడిగట్టారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను. హాస్టల్ నుంచి తీసుకుని వెళ్ళి హంసవరం సపోటా తోటల్లో అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. నారాయణ రావును వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Read More: మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. నారాయణ రావుపై పోక్సో కేసు నమోదు






