పుత్తూరు ఘటన కలచివేసింది: మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-29 14:55:56  IST  )

పుత్తూరు ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు..

పుత్తూరు ఘటన కలచివేసింది: మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati) పుత్తూరు(Putturu)లో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌(Private engineering college hostel)లో విద్యార్థిని తోటి విద్యార్థులను చితకబాదిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కాలేజీలో ర్యాగింగ్ ఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థుల అమానుష ప్రవర్తన కలచివేసిందన్నారు. సదరు విద్యార్థులపై యాజమాన్యం ఇప్పటికే చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. విద్యార్థులు ర్యాగింగ్‌ను విడనాడి స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు..

Next Story