- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ పీజీ సెట్ ఫలితాలు విడుదల.. 91.55 శాతం ఉత్తీర్ణత
ఏపీ పీజీసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు 91.55 శాతం ఉత్తీర్ణత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పీజీసెట్ (AP PGCET) ఫలితాలను మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విడుదల చేశారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు 91.55 శాతం ఉత్తీర్ణత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ నారా లోకేశ్ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ అద్భుతమైన ఉత్తీర్ణత శాతం వారి కృషి, పట్టుదలకు నిదర్శనమని ఆయన కొనియాడారు. ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో విద్యార్థులు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు. అలాగే ఈ పరీక్షలను ఎంతో పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందిని మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు.
వాట్సప్ ద్వారా ఫలితాలు
కాగా పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/PGCET ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో పాటు విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి వాట్సప్ ద్వారా కూడా ఫలితాలను పొందే వీలు కల్పించారు. అభ్యర్థులు 95523 00009 అనే వాట్సప్ నంబర్ ద్వారా కూడా తమ ర్యాంకు కార్డులను సులభంగా పొందవచ్చని స్పష్టం చేశారు.






