- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
70వ రోజు ప్రజాదర్బార్: ఆర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేశ్.. బాధితులకు భరోసా
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం 70వ రోజు ప్రజాదర్బార్‌ను మంత్రి నారా లోకేశ్ నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం 70వ రోజు ప్రజాదర్బార్(Praja Darbar)ను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నిర్వహించారు. ప్రజల సమస్యలను విన్నవించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారందరి నుంచి ఆర్జీలు స్వీకరించిన లోకేశ్, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా బుడ్డేపుపేటకు చెందిన దనపాన హరికృష్ణ తన భూమిని వైసీపీ పాలనలో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేశారని, విచారించి న్యాయం చేయాలని విన్నవించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఉలిద్ర రవి తనను అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తుండగా వైసీపీ ప్రభుత్వం అక్రమంగా విధుల నుంచి తొలగించిందని, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరారు. అలాగే పారామెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ (మేల్) పోస్టులను భర్తీ చేయాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు జిల్లా కన్నికాపురానికి చెందిన కె. ప్రకాశ్ బాబు రోడ్డు ప్రమాదంలో గాయపడగా, సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యసాయం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓర్పుగా విన్న నారా లోకేశ్ ‘కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది, బాధితులందరికీ న్యాయం జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. తదుపరి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజాదర్బార్ చిత్రాలు, వివరాలను లోకేశ్ పంచుకున్నారు.






