కొనసాగుతున్న మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. టాస్మానియా ప్రతినిధులతో భేటీ

by Naga Rani Yarlagadda |

ఆస్ట్రేలియాలో కఠినమైన అక్రిడిటేషన్ వ్యవస్థలను అమలు చేస్తుండగా.. ఆ స్థాయిలోనే ఏపీలో కూడా కరికులం రూపకల్పన చేయాలని విజ్ఞప్తి చేశారు.

కొనసాగుతున్న మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. టాస్మానియా ప్రతినిధులతో భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం, నైపుణ్యాభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. తాజాగా మెల్ బోర్న్ లో యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా (UTAS) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు చెందిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించారు. ఏపీలో ఫార్మసీ, పారామెడికల్ కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రపంచస్థాయికి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు.

ఆస్ట్రేలియాలో కఠినమైన అక్రిడిటేషన్ వ్యవస్థలను అమలు చేస్తుండగా.. ఆ స్థాయిలోనే ఏపీలో కూడా కరికులం రూపకల్పన చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీకి.. టాస్మానియా వర్సిటీకి ఉన్న ఫార్మా, హెల్త్ కేర్ నెట్వర్క్ ను పరిచయం చేసి పరిశ్రమలతో పార్ట్నర్ షిప్ కుదిరేలా చూడాలని కోరారు. అలాగే రాష్ట్రలోని గిరిజన ప్రాంతాలు, టాస్మానియాలోని మారుమూల కమ్యూనిటీలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి అంశాలపై పరిశోధనలు చేయాలని ప్రతిపాదించారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగ అర్హతలకు అనుగుణంగా ఏపీ స్టూడెంట్స్ కు స్పెషల్ స్కిల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అందించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Next Story