ప్రధాని మోడీని కలిసిన మంత్రి నారా లోకేష్.. కారణం ఇదే!?

by Jakkula.Mamatha |

ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ(శనివారం) ఢిల్లీకి చేరుకున్నారు

ప్రధాని మోడీని కలిసిన మంత్రి నారా లోకేష్.. కారణం ఇదే!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ(శనివారం) ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రధాని మోడీని కలిశారు. నారాలోకేష్‌తో పాటు భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా వెళ్లారు. ఈ తరుణంలో కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకేష్ ప్రధానితో భేటీ అయ్యారు. అయితే.. ఏపీ(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం(AP Government) ఏర్పడిన తర్వాత నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రధాని మోడీ(PM Narendra Modi)తో సమావేశం కాలేదు. ఈ క్రమంలో ఇటీవల అమరావతికి వచ్చిన ప్రధానమంత్రి తనను కలవాలని మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా సూచించారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ సమావేశం పూర్తిగా వ్యక్తిగతమైనదేనని.. ఇందులో అధికారిక, రాజకీయ అంశాలు చర్చించే అవకాశం ఉండదని తెలుస్తోంది.

Next Story