- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Nara Lokesh : తైవాన్ బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ
ఏపీ(AP)లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్(Electronics, textiles, footwear) రంగాల అభివృద్ధికి సహకారం కోసం మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh)తైవాన్ అధికారుల బృందం(Taiwanese delegation)తో భేటీ అయ్యారు. తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్ తో నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో చర్చలు జరిపారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్(Electronics, textiles, footwear) రంగాల అభివృద్ధికి సహకారం కోసం మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh)తైవాన్ అధికారుల బృందం(Taiwanese delegation)తో భేటీ అయ్యారు. తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్ తో నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో చర్చలు జరిపారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ తయారీ రంగాల్లో తైవాన్ అగ్రగామిగా ఉంది. సమావేశంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ తీసుకొచ్చిన పాలసీలు, తీసుకున్న చర్యల గురించి నారా లోకేష్ తైవాన్ ప్రతినిధుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధికి తీసుకొచ్చిన పాలసీలు, అనుమతుల దగ్గర నుండి ఉత్పత్తి ప్రారంభం వరకూ ప్రభుత్వం నుండి అందిస్తున్న సహకారం గురించి నారా లోకేష్ వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్దతిలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పలు ఉదాహారణలతో వివరించారు. 2014- 19 వరకూ తిరుపతి లో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి కల్పించిన మౌలిక సదుపాయాలు, అక్కడ ఏర్పాటైన అనేక కంపెనీలు తద్వారా వేలాదిగా యువతకు లభించిన ఉద్యోగ అవకాశాల గురించి తైవాన్ బృందం దృష్టికి తీసుకెళ్లారు.
ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే దీనిని ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి పనిచేస్తున్నాం అని లోకేష్ అన్నారు. తైవాన్ లో ఉన్న అనేక కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలి అనే ప్రణాళికలతో ఉన్నాయి. ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు సహకారం అందించాలని లోకేష్ కోరారు. ఆయా కంపెనీలు సులభంగా కార్యకలాపాలు ప్రారంభించే విధంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ ప్రత్యేక పార్కులు ఏర్పాటుకు సహకరించాలని లోకేష్ కోరారు.
ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధి కి పూర్తి సహకారం అందిస్తామని తైవాన్ బృందం అన్నారు. ఈ సమావేశంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్, మ్యానేజింగ్ డైరెక్టర్ ఎరిక్ చాంగ్, వెల్బర్ వ్యాన్గ్, ఏపీ ప్రభుత్వం తరపున ఎకనామిక్ డెవెలప్మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.






