- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌గా విశాఖ.. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌గా విశాఖ ఆవిర్భవించబోతోందని మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌గా విశాఖ ఆవిర్భవించబోతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖ జల్లా రుషికొండ ఐటీ పార్క్‌లోని హిల్ నెంబర్-3లో సిఫీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ వేగంతో పరుగులు తీస్తోందని తెలిపారు. విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. టీసీఎస్ కంపెనీకి భూములు ఇవ్వడంతో చాలా కంపెనీలు విశాఖకు వరుస కట్టాయని చెప్పారు. రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. విశాఖలో పెట్టుబడులపై మూడు నెలల్లో మరిన్ని ప్రకటనలు వస్తాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క పరిశ్రమను కూడా వదులుకోవద్దని తెలిపారు. పొరపాట్లు చేసి ఇతర రాష్ట్రాలకు కంపెనీలు వెళ్లిపోయేలా చేయడకూడదన్నారు. విశాఖను జీసీసీ రాజధానిగా చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.






