ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన.. రూ.1500 కోట్లతో సిఫీ అభివృద్ధి

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం ఉదయం విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.

ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన.. రూ.1500 కోట్లతో సిఫీ అభివృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం ఉదయం విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. నాస్ డాక్ లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తోంది. రూ.1500 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ను సిఫీ రెండు దశల్లో అభివృద్ధి చేయనుంది. ఈ సంస్ధ ద్వారా సుమారు 1000 మందికి ఉపాధి లభించనుంది. ఈ డేటా సెంటర్ పూర్తయితే విశాఖ గ్లోబల్ డిజిటల్ గేట్ వే గా మారనుంది.

Next Story