- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు సేవలు ప్రారంభం
మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంమయ్యాయి...

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి సరైన బస్సు సౌకర్యం లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి రూ.2.4 కోట్ల విలువైన రెండు Olectra ఎలక్ట్రికల్ బస్సులను ఉచితంగా అందించారు.
ఈ బస్సులను మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ వరకూ.. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడి వరకు నడుస్తుందని తెలిపారు. ప్రయాణికులకు ఈ బస్సులు ఉచితంగా సేవలు అందిస్తాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఈరోజు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను ప్రారంభించాను. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. నా విజ్ఞప్తి మేరకు మెగా ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్… pic.twitter.com/UG6TO03Q4X
— Lokesh Nara (@naralokesh) March 10, 2025






